ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ పోటీ చేయగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కలాకంజ్ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం అతిశి, జంగపూర్ నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు.