జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని AIMIM నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. అమాయకులను హత్య చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. అలాగే, టూరిస్టులపై దాడిని కూడా ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ పర్యాటకులు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.