అన్ని కాలాల్లో పెంచేందుకు తోటకూర సాగు చాలా అనువైనది. నీరు నిలిచే బంక మట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుంచి అక్టోబరు వరకు, జనవరి నుంచి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. ఆర్ఎన్ఏ-1, కో-1, ఆర్క సుగుణ వంటి రకాలు ఎంపికచేయవచ్చు. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 40 నుంచి 50 క్వింటాళ్లు వస్తుంది. ఎకరాకు రూ.10-15 వేలు వరకు ఖర్చవుతుంది.