సుప్రీంకోర్టులో అసోసియేట్ పోస్టులు

51చూసినవారు
సుప్రీంకోర్టులో అసోసియేట్ పోస్టులు
భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒప్పంద ప్రాతిపదికన 90 లా క్లర్క్–కమ్–రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(లా), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు వేతనం రూ.80,000. వయసు 32 ఏళ్లు మించకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీలోపు https://www.sci.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం.

సంబంధిత పోస్ట్