ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. కానీ ప్రస్తుతం ఆఫీసులకు వెళ్తే పనిలో పడి కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం జరుగుతోంది. ఇంట్లోనేమో కొన్నిగంటల పాటు పనిచేయడం వల్ల అలసట వస్తుంది కానీ.. శరీరానికి కావాల్సిన వ్యాయామం దొరకడం లేదు. దాంతో ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే వారానికి కనీసం 150ని. వ్యాయామంపై దృష్టి సారిస్తే ఆరోగ్యానికి మేలని డబ్ల్యూహచ్ఓ చెబుతోంది.