భూగర్భ జలాల సుస్థిరతను పెంపొందించేందుకు అమలు చేస్తున్న అటల్ భూజల్ యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం నీటి కొరత ఉన్న 7 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రూ.8,200 కోట్లతో 5 రాష్ట్రాలలో కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేసేందుకు ఆర్థిక శాఖలోని ఖర్చుల విభాగం ప్రాథమిక అనుమతి ఇచ్చింది.