ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో సెప్టెంబర్ 1న అర్థరాత్రి 5ఏళ్ల బాబును బలరామ్ దాస్ అనే పొరుగింటి వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాలుడు, తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రిలో తరలించారు.