హర్యానాలోని నుహ్‌లో మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్న బాలికను గ్రామానికి చెందిన ఓ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో రాత్రి గాలింపు చేపట్టగా రక్తంతో తడిసిన బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితుడు బాలికపై అత్యాచారం చేసి అవయవాలను విరగొట్టి, రక్తంతో తడిసిన శరీరాన్ని పారేశాడని పోలీసులు తెలిపారు.