తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో ఓ వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలకొండపల్లి SI శ్రీకాంత్ కథనం ప్రకారం.. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఈ నెల 24వ తేదీ రాత్రి ఆమె ఇంటి పక్కనున్న పెరమండ్ల రమేష్(40) అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యం పాలైన వృద్ధురాలిని కోడలు ప్రశ్నించగా జరిగిన విషయం ఇవాళ తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.