కర్ణాటకలో దారుణం జరిగింది. బెంగళూరు మాదనాయకనహళ్లికి చెందిన రవికుమార్ (39) అనే వడ్డీ వ్యాపారి వద్ద ఓ బాలిక తండ్రి రూ.70 వేలు అప్పు తీసుకొని రూ.30 వేలు చెల్లించాడు. మిగతా రూ.40వేలు, వడ్డీ కోసం రవి నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి అప్పు చెల్లించాలని బాలికను బెదిరించాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.