ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోవెలకుంట్ల మండలం కంపమల్లలో వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డిపై గుర్తుతెలియని దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. పొలంలో పనిచేస్తుండగా జరిగిన ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలపాలైన లోకేశ్వర్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.