AP: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలితో భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. దత్తిరాజేరు మండలం చక్కపేటలో ఏకల గౌరమ్మ(40) భర్త ఏకల సత్యం నివాసం ఉంటున్నారు. రోజు మాదిరి గురువారం ఉదయం ఇద్దరు పామాయిల్ తోటలో పనికి వెళ్లగా.. భార్యాభర్తల మద్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అగ్రహంతో భర్త భార్య గౌరమ్మ గొంతుపై కొడవలితో దాడి చేశాడు. దాంతో గౌరమ్మ (40) అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.