ఏపీలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త (వీడియో)

60చూసినవారు
ఏపీలో దారుణ హత్య జరిగింది. కట్టుకున్న భర్తే తన భార్యను కడతేర్చాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జక్కంపూడి మారయ్య అనే వ్యక్తి తన భార్య నాగమణి(45)ని దారుణంగా హత్య చేశాడు. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్