AP: ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్లగుంట్లలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని శనివారం ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపారు. దీంతో అక్కడ స్థానికంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.