యూపీలో కాబోయే భర్త ముందే 20 ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 10న యూపీలోని కాస్‌గంజ్ జిల్లాలోని హజారా కెనాల్ దగ్గర యువతికి కాబోయే భర్తను దారుణంగా కొట్టి.. ఆపై ఆమెను గదిలోపలికి తీసుకెళ్లి ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు.. కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.