అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఏపీలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వివాహితపై దాడి జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో అటాక్ చేశాడు. వారిద్దరి మధ్య చిన్న వివాదం తలెత్తడంతో దాడి జరిగినట్లు సమాచారం. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఈ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.