మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందాడు. కొమరాడ మండలం వన్నాంకు చెందిన వాన శివనాయుడు అనే వ్యక్తి స్థానిక వాగులో స్నానం చేసి అరటి తోటలోకి వెళ్లారు. అయితే అక్కడ ఏనుగులు ఒక్కసారిగా శివనాయుడుపై దాడి చేశాయి. విచక్షణారహితంగా తొండంతో కొడుతూ, కాలుతో తొక్కుతూ చంపేశాయి. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాయి.