సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 'శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, సీపీని ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి' అని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇవాళ అల్లు అర్జున్ ఇంటిపై పలువురు రాళ్లు విసిరిన విషయం తెలిసిందే.