బెంగళూరులోని ఓ పునరావాస కేంద్రంలోని రోగిపై సిబ్బంది దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శుభ్రత పనులు చేయాలని కోరిన వార్డెన్ ఆదేశాలను రోగి తిరస్కరించడంతో కొంతమంది సిబ్బంది అతడిని గదిలో బంధించి కర్రలతో కొట్టారు. ఈ వీడియో వైరలవడంతో పోలీసులు కేంద్రాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం వార్డెన్, సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో కేంద్రంలో ఉన్న ఇతర రోగులు భయాందోళనకు గురవుతున్నారు.