తెలంగాణ హక్కులపై దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో కృష్ణా నది నుండి 38-39 శాతం నీళ్లను వాడుకున్నాం.. కానీ ఇప్పుడు పక్కవాళ్లు దొంగతనంగా నీళ్లు తీసుకెళ్తుంటే ఎందుకు చేతకాక కూర్చున్నారని ప్రశ్నించారు. డబ్బులు దండుకొని.. కేవలం ఢిల్లీకి మూటలు పంపడం తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదని మండిపడ్డారు.