మహిళపై హత్యాయత్నం.. కొన ఊపిరితో తుప్పల్లో 16 గంటలు

84చూసినవారు
మహిళపై హత్యాయత్నం.. కొన ఊపిరితో తుప్పల్లో 16 గంటలు
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో సడక్‌ రోడ్డు వద్ద సత్తెమ్మతల్లి గుడి సమీపంలోని తుప్పల్లో ఓ మహిళ అపస్మారక స్థితిలో, తలపై గాయాలతో 16 గంటలకు పైగా పడి ఉండడం స్థానికులు గమనించి, ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి గోసంగివారిపేటకు చెందిన ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్