ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను సొంతం చేసుకుంది. మూడో WTC ఫైనల్‌లో ఆసీస్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఇది కేవలం రెండో ఐసీసీ ట్రోఫీ. ఈ విజయంతో ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కెప్టెన్ తెంబా బావుమా తన కుమారుడితో కలిసి మైదానమంతా చుట్టేశాడు. గదను తన కుమారుడి చేతికి ఇచ్చి సంతోషపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.