శంభాజీ, అతని స్నేహితుడిని పట్టుకున్న మొఘల్ సైన్యం దౌలతాబాద్ కోటలో బంధించారు. ఔరంగజేబు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా శంభాజీ మహారాజ్ పట్ల తీవ్ర క్రూరత్వం చూపాడు. బీజాపూర్, గోల్కొండ సుల్తాన్‌లకు ఇచ్చిన మర్యాద కూడా శంభాజీకి ఇవ్వలేదు. ముందుగా మొఘల్ సైన్యం నగరంలో శంభాజీ, కవి కలశ్‌లను బఫూన్‌లా వస్త్రాలు వేయించి, అంగీలకు గంటలు కట్టి, ఒంటెలపై ఊరేగించారు. దీంతో మొఘల్ సైన్యం ఎగతాళి చేస్తూ కేకలు వేసింది. ఆ తర్వాత వారిని ఔరంగజేబు వద్దకు తీసుకెళ్లారు.