ఔరంగజేబు ముందు ఖైదీగా ఉన్న శంభాజీకి మూడు షరతులు, ముస్లిం మతంలోకి మారాలని ఔరంగజేబు ఆదేశించాడు. ఆ షరతులు ఏంటంటే.. 1) మరాఠా కోటలు మొఘలులకు అప్పజెెప్పాలి. 2) రహస్య నిధులు ఇవ్వాలి. 3) గూఢచారుల పేర్లు బయటపెట్టాలి. వీటికి శంభాజీ ఒప్పుకోకపోగా ఔరంగజేబును, ప్రవక్తను దూషించాడు. మతం మారమన్న ఔరంగజేబుతో "తనకు లంచంగా ఔరంగజేబు తన కూతురినిచ్చినా మతం మారను" అన్నాడు. దీంతో మొఘల్ ఉలేమాలు శంభాజీకి మరణశిక్ష విధించారు.