చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్

73చూసినవారు
చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసీస్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్ ఖవాజా 290 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఖవాజాకు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆసీస్ బ్యాటర్‌ శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్