ఆసీస్‌ పర్యటన.. టీమిండియా వికెట్‌కీపర్‌కు గాయం

61చూసినవారు
ఆసీస్‌ పర్యటన.. టీమిండియా వికెట్‌కీపర్‌కు గాయం
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య వచ్చే నెల 5వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఎంపికైన యువ వికెట్ కీపర్ యస్తికా భాటియా గాయపడ్డారు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న ఆమె మణికట్టుకు గాయమైంది. దీంతో ఆమె సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. యస్తికా స్థానంలో అన్‌క్యాప్ ప్లేయర్ ఉమా ఛేత్రీని భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్