సాఫ్ట్ వేర్ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

71చూసినవారు
సాఫ్ట్ వేర్ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆటోలో వస్తుంది. ఈ క్రమంలో మసీదు బండ సమీపంలోకి రాగానే ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్