మహారాష్ట్రలోని అమరావతిలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ పెద్దాయన తన ఇంగ్లిష్ వాగ్ధాటితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయన ఇంగ్లిష్ ను చాలా అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ యువకుడు సోషల్ మీడియాతో పంచుకోవడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా ఇంగ్లిష్ రావడం తప్పనిసరి అని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఆంగ్లం నేర్చుకుని మాట్లాడాలని సూచించాడు.