యూపీలోని ఆగ్రాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఫతేహాబాద్ ప్రాంతంలో ఓ ఆటో రోడ్డుపై వేగంగా వస్తూ అదుపు తప్పింది. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి బోల్తా పడింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో బాధిత మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.