TG: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి వంతెనపై నుంచి కింద పడింది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 16 మంది కూలీలు ఉన్నారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారిని హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.