పీవీ సింధు రియో 2016 ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు. BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయురాలు ఈమె. ఇప్పటివరకు BWFలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించారు. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ కూడా సింధూనే. ఆమె 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులను అందుకుంది.