సీరియల్ కిల్లర్, ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మ (67)ను దిల్లీ పోలీసులు రాజస్థాన్‌లోని దౌసాలో అరెస్టు చేశారు. మనుషుల్ని అతి కిరాతకంగా చంపేసి, UPలోని కాస్‌గంజ్‌లో మొసళ్లు ఎక్కువగా ఉండే హజారా కాల్వలో పడేసి, ఆధారాలు దొరక్కుండా చూసుకునేవాడట. వాహనాలు బుక్ చేసుకొని డ్రైవర్లను చంపేసి, ఆ తర్వాత వాటిని అమ్ముకునేవారని పోలీసులు తెలిపారు. 50కి పైగా హత్యలు, 125 అక్రమ కిడ్నీ మార్పిడులు చేశాడని వెల్లడించారు.