తమ దేశంలోని కార్యాలయాలు మూసేసి వెళ్లిపోవాలని వార్తాసంస్థ బీబీసీని అజెర్‌బైజాన్ ఆదేశించింది. తమ చట్ట ప్రకారం కార్యాలయం నడిపే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చిచెప్పింది. దీంతో తమ కార్యాలయం మూసేయక తప్పలేదని, మీడియా స్వేచ్ఛను అజెర్‌బైజాన్ తుంగలో తొక్కిందని బీబీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. బీబీసీ ఆ దేశంలో 1994 నుంచి పనిచేస్తోంది. మరోవైపు బీబీసీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని అజెర్‌బైజాన్ మండిపడింది.