అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముగింపుగా B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. వైట్ హౌస్ బాల్కనీలో ట్రంప్ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి, రెండు B-2 బాంబర్లు, F-35, F-22 ఫైటర్ జెట్లు ఆకాశంలో దూసుకెళ్తున్న దృశ్యాన్ని తిలకించారు. B-2 బాంబర్లు ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసిన రకమే కావడం గమనార్హం.