TG: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. లతిత, రమేష్ దంపతుల 45 రోజుల వయసు గల శిశువుకు పీహెచ్సీలో టీకా వేయించారు. టీకా వేసిన కొద్దిసేపటికి పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తిరిగి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.