AP: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాజాంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. వైద్యం వికటించడంతో బిడ్డకు జన్మనిచ్చి బాలింత ప్రాణాలు విడిచిందని తెలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.