హనుమాన్ చాలీసా వింటూ గర్భంలో ఉన్న శిశువు కదిలిన ఘటనకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో గర్భంతో ఉన్న ఓ తల్లి తన కడుపు దగ్గర మొబైల్ పెట్టి హనుమాన్ చాలీసా వినిపించింది. ఈ క్రమంలో కడుపులో ఉన్న శిశువు చాలీసా వినగానే కదులుతున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే అంతకు ముందు సినిమా పాట పెడితే ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. కాగా ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట వైరలవుతోంది.