ఆరోగ్యానికి మేలు చేసే బూసి పండ్లు చాలా అరుదుగా లభించే ఫలాలు. భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడే మార్పుల ఆధారంగా ఈ చెట్టుకు కాయలు కాస్తాయి. అందుకు 3-5 yrs సమయం పడుతుంది. వేసవికాలం తర్వాతే ఈ చెట్టు కాయలు పండ్లుగా మారుతాయి. ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లు కాస్త పుల్లగా ఉంటాయి. వీటి గింజల ద్వారా నూనె తయారు చేసేవారని చెబుతారు. 20 ఏళ్ల క్రితమే ఈ నూనె ఖరీదు లీటర్ సుమారు రూ.2000 వరకు ఉండేదట.