ఛాంపియన్స్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఛాంపియన్ ట్రోఫీ ముగియగానే ఐపీఎల్ సీజన్ 2025 మొదలవుతుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. గత సీజన్ వరకు జియో సినిమాలో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించిన క్రికెట్ ఫ్యాన్స్ ఈ సారి అది కుదరదు. ఈ సారి మ్యాచులను పూర్తిగా చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.