తెలంగాణలో త్వరలో బాలభరోసా పథకం ప్రారంభించి.. ఐదేళ్లలోపు పిల్లలకు అవసరమైన శస్త్రచికిత్సలు చేయిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. సోమవారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లను అక్టోబర్ 2న ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నవంబర్‌లోపు నిర్మించాలని చెప్పారు.