రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్-2'లో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సన్‌పిక్చర్స్ సంస్థ, కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్‌లో అతిథి పాత్రలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ మెప్పించారు. ఈ చిత్రంలో బాలయ్య ఏపీకి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రజనీ, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని, అది సుమారు 5 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.