చారిత్రాత్మక పాత్రలు పోషించడంలో బాలకృష్ణకు ఎవరు సాటిరారు. వేములవాడ భీమకవిలో భీమకవిగా, దాన వీర శూరకర్ణలో అభిమన్యుడిగా, ఆదిత్య 369లో కృష్ణదేవరాయగా, గౌతమీపుత్ర శాతకర్ణిలో శాతకర్ణిగా అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే నరసింహనాయుడు, సింహా, లెజెండ్ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. నరసింహనాయుడు, సింహా, శ్రీరామరాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, మువ్వగోపాలుడు, ఆదిత్య 369 వంటి చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.