తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ క్రమంలో బాలయ్య అల్లు అర్జున్‌ను ఆటపట్టించారు. "కుర్చీ మడతపెట్టి పాట వచ్చినప్పుడు స్టెప్పులు వేద్దాం పదా" అని బాలయ్య అన్నారు. అయితే బన్నీ సిగ్గుతో "నేను రాలేను సర్" అని నవ్వుతూ మళ్లీ తప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.