హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 8, 9, 10 మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ వేడుకలో.. సోమవారం ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ సందడి మొదలైంది. మంగళవారం కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇవాళ రథోత్సవంతో వేడుకలు ముగియనున్నాయి.