పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పాక్ నుంచి విడిపోయి బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ వెల్లడించింది. క్వెట్టాలో కొత్త పార్లమెంట్ ఫొటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని భారత్ సహా ఇతర దేశాలను కోరింది. కాగా పాక్ నుంచి స్వాతంత్య్రం కోసం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్టీ సహా పలు సంస్థలు పోరాటం చేసిన విషయం తెలిసిందే.