సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీ గ్యారంటీల అమలుకు 10 వేల రోజులు కూడా సరిపోవు అని ఎద్దేవా చేశారు. అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద తాము ఇళ్లు నిర్మిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తోందని మండిపడ్డారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు.