అమృత్ పథకంలో అక్రమాలపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. 'అక్రమాలపై ఆరోపణలు చేసే బదులు ఫిర్యాదు చేస్తే.. కేంద్రం విచారిస్తుంది. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదు. గత BRS ప్రభుత్వంలోని బడా నాయకుల ప్రోత్సాహంతోనే కబ్జాలు జరిగాయి. అక్రమ కట్టడాలకు కారణమైన BRS నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి లడ్డూ కల్తీ హిందూ ధర్మంపై దాడి మాత్రమే కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే' అని అన్నారు.