బార్లీ నీటితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బార్లీ నీటిని ప్రతిరోజు తాగితే శరీరం చల్లబడుతుంది. అలాగే మలబద్ధకం తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇంకా రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.