తెలంగాణలో గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటి స్థానంలో నగదు అందించేందుకు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.500 లేదా ఆపైనే ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే నగదు బ్యాంకు ఖాతాల్లో వేయాలా? లేక నేరుగా చేతికి ఇవ్వాలా? అనేది ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు ప్లాన్ చేస్తోన్నట్లు వినిపిస్తోంది.