భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను బీసీసీఐ వినూత్నరీతిలో సత్కరించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గవాస్కర్ గౌరవార్థం ప్రత్యేక బోర్డ్‌రూమ్‌ను ఏర్పాటు చేసి వినూత్నంగా సత్కరించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొదటి క్రికెటర్ గవాస్కర్. అందుకే ఈ బోర్డ్‌రూమ్‌కు '10,000 గావస్కర్' అని బీసీసీఐ నామకరణం చేసింది. ఈ బోర్డ్ రూమ్‌ను సునీల్ గవాస్కర్ గురువారం ప్రారంభించారు.